Random Video

కాలా సినిమా విడుదలకు కర్ణాటకలో లైన్ క్లియర్

2018-06-05 180 Dailymotion

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమా విడుదలకు కర్ణాటకలో లైన్ క్లియర్ అయ్యింది. కర్ణాటకలో కాలా సినిమా విడుదలకు చర్యలు తీసుకోవాలని, పోలీసు భద్రత కల్పించాలని మంగళవారం కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంతర ఆదేశాలు జారీ చేసింది.
కావేరీ నీటి పంపిణి విషయంలో రజనీకాంత్ కన్నడిగులకు వ్యతిరేకంగా మాట్లాడారని, కన్నడిగులను కించపరిచిన రజనీకాంత్ నటించే అన్ని సినిమాలను కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకుంటామని కన్నడ సంఘాల నాయకులు హెచ్చరించారు.
కాలా సినిమా కర్ణాటకలో విడుదల చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని ఆ సినిమా నిర్మాతలు, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కాలా సినిమా కర్ణాటకలో విడుదల కాకుంటే తీవ్రస్థాయిలో ఆర్థికంగా నష్టం వస్తుందని హైకోర్టులో మనవి చేశారు.
కర్ణాటకలో కాలా సినిమా విడుదల చెయ్యడానికి అన్ని చర్యలు తీసుకోవాలని, సినిమా థియేటర్ల దగ్గర భద్రత కల్పించాలని కర్ణాటక హైకోర్టు మంగళవారం కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాలా సినిమా విడుదల అయ్యే థియేటర్ల దగ్గర ఆందోళనలు చెయ్యడానికి అవకాశం ఇవ్వరాదని పోలీసులకు హైకోర్టు సూచించింది.